జయరాం హత్య కేసులో ఆ విషయాలే బయటికి వస్తాయా?

jayaram murder case updates

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. నిందితుల రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను నాంపల్లి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిందితులను మూడ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితులను విచారించనున్నారు.

Also read : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి

దర్యాప్తులో భాగంగా మరికొంత మందిని విచారిం చేందుకు కసరత్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డి, శిఖా చౌదరిల కాల్ డేటా తెప్పించారు పోలీసులు. పద్మశ్రీ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇద్దురు నిందితులను కోర్టు అనుమతితో కస్టడికి తీసుకున్న తర్వాత.. సీన్ ఆప్ అపెన్స్ ప్లేస్‌లో సీన్ రి కస్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అలాగే రాకేష్ రెడ్డిని విచారించేటప్పుడు శిఖా చౌదరికి సీఆర్పీ సీ సెక్షన్ 41 కింది నోటీసులు జారీ చేసి.. ఇద్దరిని ఒక్కేదగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది.

జయరాం హత్యకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే శిఖా ఆయన ఇంటికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది? అక్కడ నుంచి ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్లారు? అమెరికా నుంచి ఇండి యాకు వచ్చిన తర్వాత ఆయన్ను ఎన్నిసార్లు కలిశారు? ఏవిషయాలు మాట్లాడారు? ఆయనకున్న అప్పులు, ఫైనాన్షియర్లు, వ్యాపారాలావాదేవీలకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. అయితే పోలీసు కస్టడీ విచారణలో నందిగామ పోలీసులు తేల్చిన విషయాలే రిపీట్ అవుతాయా.. లేక ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తాయా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.

One thought on “జయరాం హత్య కేసులో ఆ విషయాలే బయటికి వస్తాయా?”

Comments are closed.