పెళ్లి ఇంట్లో విషాదం.. కాబోయే వరుడు చెట్టుకు ఉరి వేసుకుని..

ఆత్మహత్య చేసుకోవడమే నేరం.. అసలు ఎంతో బలమైన కారణం.. ఒత్తిడి ఉంటే తప్ప.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవాలి అనుకోరు.. కాని కొందరు మాత్రం.. చిన్న చిన్న కారణాలతో మనస్థాపానికి గురై నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు తన పెళ్లికి డిజె సిస్టమ్‌ పెట్టేందుకు తండ్రి ఒప్పుకోలేదని.. ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది..

బాజా భజంత్రీలు మోగాల్సిన ఇంట్లో.. డిజె కోరిక విషాదం నింపింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం కొంకనిపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవించే కుంటుబం హన్మంతుది.. ఈ నెల24న హన్మంతు పెద్ద కొడుకు అశోక్‌ పెళ్లి జరగాల్సి ఉంది.

Also Read : జస్ట్ మిస్.. ఆయన లేకపోతే.. : వీడియో వైరల్

అదే మండలానికి చెందిన అశ్వినితో అశోక్‌ పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు తండ్రి. అశోక్‌ పదో తరగతి వరకు చదివి.. తరువాత హైదరాబాద్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే తనకు పెళ్లి ఫిక్స్‌ అవ్వడంతో.. పెళ్లి రోజున డిజె సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని తండ్రిని కోరాడు అశోక్‌.. ఖర్చ ఎక్కువ అవుతుందని.. తండ్రి వద్దన్నాడు. తన పెళ్లికి చాలామంది స్నేహితులు వస్తారని.. వారి కోసం డిజేను పెట్టాలని డిమాండ్‌ చేశాడు. తరువాత చూద్దాం లే అని తండ్రి అనడంతో.. మనస్థాపానికి గురైన అశోక్‌.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లతో సందడిగా ఉండాల్సిన ఆ కుటుంబంలో ఇప్పుడు పెను విషాదం నెలకొంది.