లవర్స్ పై దాడి కేసు.. జ్యోతి మృతదేహాన్ని బయటకు తీసి..

జ్యోతి హత్య కేసులో గుంటూరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హత్య తరువాత జ్యోతికి సంబంధించిన ఫోరెన్సిక్‌ ఆధారాలు సేకరించడం పోలీసులు మరిచిపోయారు.
జ్యోతి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో.. మంగళవారం మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేశారు. అయితే బుధవారం జ్యోతి వస్త్రాల కోసం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న జ్యోతి బంధువులు.. పోలీస్‌ల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

Also Read : నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమ జంట ఏకాంతంలో ఉండగా..

తాడేపల్లి మహానాడు ఏరియా వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన చుంచు శ్రీను, అంగడి జ్యోతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంకాలం మంగళగిరి మండల పరిధిలోని ఏసీఏ క్రికెట్‌ స్టేడియం వెనుక వైపు వున్న నిర్మానుష్య ప్రాంతానికి ప్రేమికులిద్దరూ వచ్చారు. వారు ఏకాంతంగా వున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. ఇద్దరి తలపై రాడ్డుతో బలంగా పలుమార్లు మోదారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం జరగడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది.