ఆకాశ్ అంబానీ పెళ్లి కార్డులో అందాలెన్నో.. వీడియో వైరల్

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహనికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి సంబంధించిన శుభలేక సోషల్ మీడియాలో వైరల్ అయింది. వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాష్‌ల వెడ్డింగ్ జరగనుంది. సంప్రాదాయ హంగులతో పాటు, మోడ్రన్ లుక్‌తో శుభలేఖను డిజైన్ చేశారు. ఒక్కో కార్డు ఖరీదు లక్షా యాభైవేల వరకు ఉండవచ్చని బాలీవుడ్ సమాచారం. వచ్చే నెల మార్చి 9న వీరి వివాహం జరగనుంది.