జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్.. సినీనటుడు భరత్..

chigurupati jayaram murder case updates

జయరాం హత్య కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల‌ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు 11గంటలపాటు పోలీసులు వారిని విచారించారు. ఈ దర్యాప్తులో రాకేష్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. తనకు ఇవ్వాల్సిన 4కోట్ల రూపాయల కోసమే జయరాంను ఇంటికి పిలిచి,,నిర్భదించి హత్య చేసినట్టు రాకేశ్‌రెడ్డి ఒప్పుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. ప్లాన్ ప్రకారమే..ఫేక్ మొబైల్ నెంబర్‌ క్రియేట్ చేసి అమ్మాయితో ఇంటికి పిలిచినట్టు వెల్లడైంది.

Also read : ‘ప్రేమికుల రోజు’ స్మార్ట్‌ఫోన్ల ఆఫర్లు చూస్తే..

ఈ కేసులో ఇప్పటి వరకు 30మందిని విచారించినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు త్వరలోనే శిఖా చౌదరిని కూడా విచారిస్తామన్నారు డీసీపీ. నిందితులతో సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేస్తామని చెప్పారు. రాకేశ్ రెడ్డికి సంబంధించిన బ్యాంకు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

జయరాంను హత్య చేసిన తరువాత డెడ్‌బాడీని కారులోనే పెట్టుకుని 5గంటలపాటు హైదరాబాద్‌లో తిరిగినట్టు వార్తలు వచ్చాయి. ఐతే దర్యాప్తు అధికారి..డీసీపీ శ్రీనివాస్‌ మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. అలాగే నిందితుడు రాకేష్‌రెడ్డికి నల్లకుంట సీఐ శ్రీనివాస్‌.,ఇబ్రహీంపట్నం ఏసీపీ సహకరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలో రాకేశ్‌రెడ్డి..మల్లారెడ్డి, శ్రీనివాస్‌ సలహాలు తీసుకున్నట్లు ..వారితో ఫోన్ సంభాషణ జరిపినట్టు వార్తలు వచ్చాయి. వీరి ప్రమేయంపైనా ఆరా తీస్తామన్నారు డీసీపీ శ్రీనివాస్‌.

జయరాం హత్య కేసులో మరోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈకేసులో సినీ నటుడు భరత్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు విచారించారు. దీంతో కేసుపై ఇంకాస్త ఉత్కంఠ పెరిగింది. భరత్‌కు కేసుతో సంబంధం ఉందా అనే లేదా అన్న కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

One thought on “జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్.. సినీనటుడు భరత్..”

Comments are closed.