ప్రేమ జంటలకు కష్టాలు తప్పేలా లేవు..

today valentine day

వాలెంటెన్స్ డే!ప్రేమలోకంలో విహరిస్తున్న వాళ్లకు ఇదో పవిత్రమైన రోజు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఈరోజును ప్రేమికులు తమ మనసులో దాగివున్న ప్రేమను వెళ్లబుచ్చేందుకు తహతహలాడుతుంటారు. ఈరోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. తమ ప్రేమని చెప్పి…. గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకుంటారు. సరదాగా కలిసి తిరగడానికి, ఏకాంతంగా గడిపేందుకు ప్రేమికులు ఆసక్తి చూపుతుంటాయి. ఇలా వాలంటైన్స్ డేను ప్రేమ జంటలు సందడిగా గడపాలని కోరుకుంటుంటారు.

Also read : మరోసారి ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు

అయితే హిందూ సంస్థలు మాత్రం ప్రేమికుల రోజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మన సంప్రదాయమే కాని ప్రేమికుల రోజును జరుపుకుంటే దాడులు తప్పబోవని హెచ్చరిస్తాయి హిందూ సంస్థలు. ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటైన్స్‌ పేరు చెబుతూ.. ప్రేమ జంటలెవరైనా బయట కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామంటోంది భజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామంటామని హెచ్చరిస్తున్నారు.

ప్రేమికుల రోజు పేరుతో పబ్‌‌లు, మాల్స్‌, హోటల్స్‌‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరిపితే దాడులు తప్పవంటున్నారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. రోడ్లు, పార్కులలో ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇవాళ అన్ని కూడళ్లలో వాలెంటైన్స్‌ దిష్టి బమ్మలను దహనం చేసి తమ నిరసనలు తెలుపనున్నారు. నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు.

భజరంగ్ దళ్ తోపాటు వివిధ హిందూ సంస్థలు పిలుపుతో ఇవాళ ప్రేమ జంటలకు కష్టాలు తప్పడం లేదు. జంటగా బయటికి వెళితే ఎక్కడ దొరికిపోతామోనని భయపడుతున్నారు. దీంతో ఇవాళ పార్కులు, రెస్టారెంట్లు కాస్త బోసి పోతాయనే చెప్పాలి.

One thought on “ప్రేమ జంటలకు కష్టాలు తప్పేలా లేవు..”

Comments are closed.