జయరాం హత్యకు ఇలా ప్లాన్ చేసి..

chigurupati jayaram murder case latest updates

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితుల కస్టడీ శుక్రవారం ముగుస్తోంది. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు తెలియాలంటే మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోర్టును పోలీసులు కోరనున్నారు. శుక్రవారం కూడా మరికొంతమందిని పోలీసులు విచారిస్తున్నారు.

Also read : ఉగ్రదాడి నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా కేసీఆర్

మరోసారి నందిగామ ఐతారం వెళ్లి క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీస్‌ల అదుపులో నిందితులను తెల్లవార్లూ విచారించిన పోలీసులు అనేక వివరాలు రాబట్టారు. ముఖ్యంగా రాకేష్‌తో పోలీసుల సంబంధాలపై శుక్రవారం విచారణ జరపనున్నారు. అలాగే కేసులో కీలకంగా అనుమానిస్తున్న శిఖా చౌదరిని రేపు (శనివారం) మరోసారి బంజారాహిల్స్ ఏసీపీ విచారించనున్నారు..

ఇప్పటి వరకు జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయరాం ఆస్తులు కాజేయడానికి వారం రోజుల ముందు నుంచే స్కెచ్‌ వేసినట్టు బయటపడింది. జయరాం మరణిస్తేనే ఆయన ఆస్తులు తనకు వస్తాయని రాకేష్‌ భావించాడు. అందుకే జయరాంతో బలవంతగా 100 రూపాయల బాండ్‌ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఆ వెంటనే సూర్యా అనే సినీ నటుడు జయారం ఉన్న హోటల్‌కు వెళ్లి డ్రైవర్‌ను అని చెప్పి కారులో ఎక్కుంచుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు..

అయితే జయారంను హత్య చేస్తున్న విషయాన్ని ముందే నలుగురికి రాకేష్‌ చెప్పినట్టు తెలుస్తోంది. చింతల్ రౌడీ షీటర్‌ నగేష్‌.. అతడి మేనల్లుడు విశాల్‌, డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డిలకు.. జయారంను హత్య చేస్తున్నట్టు ముందే చెప్పాడు. ఆయన చనిపోతేనే ఆస్తులు వస్తాయని నలుగుర్ని నమ్మించాడు రాకేష్‌.. ఈ హత్య చేసినప్పుడు సీన్‌లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

జయరాంను హత్య చేసిన తరువాత.. డెడ్‌ బాడీతో నల్లకుంటకు పీఎస్‌కు వెళ్లినట్టు రాకేష్‌ పోలీసులకు చెప్పాడు. అయితే సీఐ శ్రీనివాస్‌కు కారులో డెడ్‌ బాడీ ఉన్నట్టు చెప్పలేదని .. ఆయన సూచనలతో జయరాం హ్యతను యాక్సిడెంట్‌గా క్రియేట్‌ చేసి.. నందిగామ వెళ్లి కారును వదిలేసినట్టు రాకేష్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు విచారణ పూర్తైన తరువాత మొత్తం ఐదుగుర్ని నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా శనివారం మీడియాకు జయరాం హత్య వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వివరించే అవకాశం ఉంది.