కీలక దశకు చేరుకున్న జయరామ్ హత్య కేసు

కీలక దశకు చేరుకున్న జయరామ్ హత్య కేసు

jay

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో కీలక మలుపు తిరిగింది. కీలక నిందితుడు రాకేష్‌రెడ్డితో సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారుల పాత్రపై నాంపల్లి న్యాయస్థానం విచారణ చేపట్టింది. అప్పటి రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పేర్లను దర్యాప్తు అధికారులు.. ఛార్జిషీట్లో చేర్చారు. అయితే.. తమపై శాఖాపరమైన విచారణ నిలిపివేయాలంటూ ఆ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాకేష్‌రెడ్డి సహా ముగ్గురు అధికారుల సంబంధాలపై నాంపల్లి కోర్టులో ట్రయల్‌ మొదలైంది. రాంబాబు, శ్రీనివాస్, మల్లారెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. మరో రెండు నెలల్లో ఈ కేసు విచారణను ముగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story