ప్రపంచంలో అత్యుత్తమ టాయిలెట్‌ పేపర్‌గా పాకిస్థాన్‌ జాతీయ జెండా..

Best toilet paper in the world,

ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జెండాయేనట. అవునని గూగులమ్మ చెబుతోంది. ‘Best toilet paper in the world’ అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. దీంతో పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్‌ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్‌లో పెట్టి ఓ ఆట ఆడుకున్నారు.

Also Read : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది మృతి

గూగుల్‌ లో ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగుల్‌ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.

Recommended For You