నాగార్జున మేనకోడలి పెళ్లి? వరుడు..

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్‌గా నటించిన సుప్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాలీవుడ్ సమాచారం. అక్కినేని నాగార్జునకి మేనకోడలు కూడా అయిన సుప్రియ ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు.

అయితే ఈ మధ్య అడవి శేష్ హీరోగా నటించిన గుఢచారి సినిమాలో సుప్రియ కీ రోల్ ప్లే చేసింది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఆ సినిమాలో చేయమని శేష్ అడగ్గానే సుప్రియ ఒప్పుకుందని అప్పుడు వార్తలు వినిపించాయి. మరి ఆ స్నేహం పెళ్లి పీటల వరకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలకు ఊతమిచ్చేలా వచ్చేనెలలో తానో పేద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్నానని అడవి శేష్ ఇటీవల ట్వీట్ చేయడంతో ఇదే కావచ్చేమోనని అభిమానులు భావిస్తున్నారు. సుప్రియ సినిమాలకు దూరంగా ఉన్నా అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది.

Recommended For You