పాక్ ఒకటి వేస్తే… భారత్ 20 వేస్తుంది : పర్వేజ్‌

Parvez Mosaraf comments on war

పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏ క్షణాన ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై ప్రతీకార దాడికి దిగుతుందా? లేక అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి చర్చలతో పరిష్కారం చూపిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూఏఈలో ఓ మీడియా సమావేశంలో పర్వేజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే ఓ వార్తా పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.కశ్మీర్ దాడికి పాకిస్తానే దోషి అని భారత్ భావిస్తున్నవేళ.. ఈ కథనం కలకలం రేపుతోంది… పుల్వామా దాడిని ఖండించకపోగా.. భారత్ ఎదురుదాడికి దిగకముందే పాక్ మరో దాడికి పాల్పడాలని సలహాలిస్తున్నారు పర్వేజ్‌.

ఇప్పటివరకు భారత్ మీద పాకిస్థాన్ ఎన్ని ఉగ్రదాడులు జరిగినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయే తప్ప అణుదాడుల ప్రస్తావన రాలేదు. అయితే ముషారఫ్ ఇప్పుడు అణుదాడుల ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు పాకిస్థాన్ ఒక్క అణుబాంబు వేస్తే చాలు భారత్ 20 అణుబాంబులతో పాకిస్థాన్ ను భస్మీపటలం చేస్తుందన్న అయన ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధ దాడికి దిగకపోవడమే మంచిదని హితవు పలికారు.

మొత్తం మీద భారత్ పట్ల పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి తేట తెల్లం అవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిని రేపుతోంది.