దెబ్బకు దెబ్బ ..దాడిలో 300 మంది ఉగ్రవాదుల హతం?

damage to trees it said was caused by Indian military airstrikes.

దెబ్బకు దెబ్బ కొట్టింది భారత సైతం.. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి జరిగిన 12 రోజుల తరువాత.. పాక్‌లో తిష్టవేసిన ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. బాల్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో వరకు భారత వైమానికి దళాలు చేసిన బాంబుల శబ్ధం మారుమోగింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం.

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ జేషే మహ్మద్‌ శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం దాడులు చేసింది ఈ మెరుపు దాడుల్లో ఆల్ఫా-3 నియంత్రన కేంద్రం ద్వంసమైంది. బాల్‌కోట్‌, చకోటి, ముజఫరాబాద్‌ల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది..

భారత వైమానిక దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. రక్షణ, ఆర్థికశాఖ మంత్రులతో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత వైమానిక దాడులకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ శాఖ సలహాదారు అజిత్‌ దోవల్‌, ప్రధాని మోదీకి వివరిస్తున్నారు..

భారత ప్రతీకార చర్యపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ దాడులపై స్పందించారు.. భారత వైమానిక దళానికి సెల్యూట్‌ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు..

అటు.. పాకిస్తాన్‌లో‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖ అధికారులతో ఇమ్రాన్‌ ఖాన్ సమీక్ష చేపట్టారు. ఎల్‌వోసీ దగ్గర హై అలర్ట్‌ ప్రకటించారు.