మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్

మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టిన ఇమ్రాన్‌ఖాన్

మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్! తాడోపేడో తేల్చుకుంటాం! పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లేటెస్ట్ స్టేట్‌మెంట్ ఇది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు బొక్కబోర్లా పడినప్పటికీ ఇమ్రాన్‌ వైఖరి మారలేదు. పైగా, తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. సరి హద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి అహర్నిశలు కృషి చేశానని చెప్పుకొచ్చారు. చర్చల విషయంలో తన తప్పేమీ లేదని, తప్పంతా భారతదేశానిదే అంటూ మసిపూసి మారే డుకాయ చేసేందుకు ప్రయత్నించారు. శాంతి చర్చల కోసం తానెంతగానో తాపత్రయపడ్డానని, కానీ, భారతప్రభుత్వం ఏమాత్రమూ ముందుకు రాలేదని ఆరోపించారు. ఇకపై, భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్‌పై ఇమ్రాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నారు. అమాయక ప్రజలను భారత బలగాలు అణిచివేస్తున్నాయని ఆరోపించారు. బక్రీద్‌ను కూడా స్వేచ్చగా జరుపుకోనివ్వలేదని విమర్శించారు. కశ్మీరీల ప్రాథమిక హక్కులు-స్వేచ్ఛను భారత ప్రభుత్వం హరించివేస్తోందని ఆరోపించారు. కశ్మీరీల పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని కోరారు. స్వయం ప్రతిపత్తి రద్దుపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడతామని చెప్పుకొచ్చారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు ఇమ్రాన్.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా, చర్చల్లేవ్ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చింది. కశ్మీర్ విషయంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాకిస్థాన్‌కు జవాబు చెప్తామని తేల్చి చెప్పింది. కశ్మీరీల విషయంలో అనవసరంగా నోరు పారేసుకోవ డం మానేసి, సొంతగడ్డపై సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని హితవు పలికింది.

Read MoreRead Less
Next Story