బుజ్జి ఎలుకకి ఎంత కష్టం వచ్చిందో..కాపాడిందెవరు..

Fat Rat Gets Stuck In Manhole Cover,

మనిషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో మాన్ హోల్లో చిక్కుకున్న ఓ ఎలుకను చాకచక్యంతో కాపాడారు. దీనికి షంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జర్మనీలోని కాలువపై ఉన్న మాన్ హోల్‌ పైకప్పు మధ్యలో ఓ ఎలుక చిక్కుకుపోయింది. బయటకు రాలేక మధ్యలో చిక్కుకొని విలవిలలాడింది. దాన్ని గుర్తించినరెస్క్యూ సిబ్బంది ఎలుకను కాపాడడం కోసం సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది కాపాడిన తీరు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది

Image may contain: shoes and outdoor

చలితొ వణుకుతూ మూత మధ్యలో చిక్కుకుపోయి ముందుకీ, వెనక్కీ వెళ్ళలేక ప్రాణాపాయ పరిస్ధితిలో ఉన్న ఎలుకను గుర్తించినట్లుగా జంతు సంరక్షుడు మైఖేల్ సెహ్ర్బి బిసికి వివరించారు. జర్మనీలోని బెన్సెంహీ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు ఎనిమిది మందితో కూడిన రీన్ నెకర్ జంతు రెస్క్యూ టీం ఆ చబ్బీ మూషికాన్ని రక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వేల సంఖ్యలో లైక్స్‌తో పాటు నెటిజన్ల అభినందనలు అందాయి.

చాలా అందంగా ఉన్న ఆ ఎలుకను రక్షించిన టీంకు , ధన్యవాదాలు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అపాయకర పరిస్థితిలో ఉన్న చిన్న జంతువును కాపాడినందుకు థాంక్స్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సంఘటన మానవజాతిపై ఉన్న విశ్వాసానికి, ముఖంపై ఓ సంతృప్తికరమైన చిరునవ్వుకు కారణమైందని మరొకరు స్పందించారు. ఎలుకను రక్షించిన రెస్క్యూ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అడవిలోకీ తీసుకువెళ్ళి వదిలేశారు. 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ను ముగించారు

Recommended For You