ఈ బీచ్‌లో రాళ్లు పుట్టి పెరుగుతాయి

new-zealand-meraki-rocks-be
new-zealand-meraki-rocks-benew-zealand-meraki-rocks-be

అందమైన బీచ్..చూస్తు ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. చూడడానికి వింతగా కనిపించే రాళ్ళు. అవును.. అక్కడ రాళ్ళు విచిత్రంగా కనిపిస్తాయి. వీటిని చూడడానికి విదేశాల నుంచి టూరిస్ట్‌లు క్యూ కడతారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే.. వాటిని చూస్తూ ఇసుక తిన్నెల్లో ఆడుకోవడం మనస్సుకు చేప్పలేనంత ఆనందం. బీచ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి అలలు, ఇసుక తిన్నెలు. కానీ న్యూజీలాండ్‌లోని మోరీకీ బీచ్‌లో మరో విషయం పర్యాటకులను కనివిందు చేస్తోంది. అవి ఇసుకలో కనిపించే కొన్ని రాళ్లు. వాటిని చూస్తే పేద్ద బంతులేమైనా దొర్లుతున్నాయేమో అనే భ్రాంతి మనలో కలుగుతుంది. కానీ ఇవి సాధారణంగా కనిపించే రాళ్ళు కాదు. బీచ్‌లో 19 కిలోమీటర్ల మేర ఇలాంటి విచిత్రమైన రాళ్ళు కనిపిస్తాయి. వీటి వెనుక ఓ శాస్త్రియ కోణం ఉంది. ఇక్కడ రాళ్ళు చిన్న చిన్నగా పెరుగుతాయి.

ఇవి గుండ్రంగా కాకుండా ధీర్ఘవ‌ృత్తాకారంగా కనిపిస్తాయి. ఇవి పది మీటర్ల వ్యాసార్ధం వరకూ ఉంటాయి. పెద్ద రాళ్ళు దాదాపు ఏడు టన్నుల బరువున్నవి ఉన్నాయి. 40 లక్షల ఏళ్ళ నుంచి ఇది ఎదుగుతున్నాయి. అయితే ఇవి ఎలా ఏర్పడుతున్నాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అవి సముద్రంలో ఉండే బురద, ఇసుకతో ఏర్పడ్డ రాళ్ళుగా పరిశోధకుల తేల్చారు. వీటిలో కార్బైట్,ఇనుము, మెగ్నీషియం, కార్బన్ లాంటి ఖనిజాలు వాటిలో ఉంటాయి. అందువల్ల ఈ రాళ్ళు గుండ్రంగా గట్టిగా ఏర్పడటంతో సిమెంటులా ఉపయోగపడుతాయి. అలల తాకిడికి భూమిపై ఒత్తిడి పెరిగి బురద మట్టి పైకి పొంగి మేట వేయడంతో రాళ్ళుగా ఏర్పడుతాయి. వీటిలో మరేదో
మిస్టరీ దాగి ఉందని పరిశోధకుల అనుమానం. దాన్ని నివృత్తి చేసుకునే దిశగా మరింత పరిశోధనలు సాగిస్తున్నారు.