ఈ దిండుతో కూర్చున్న చోటే హాయిగా నిదురపోవచ్చు ..!

best-airplane-pillows

ప్రయాణ సమయంలో చాలా మందికి నిద్ర రావడం సహజమే. ,ట్రైన్‌లోనో, విమానంలోనో ప్రయాణిస్తున్న సమయంలో చల్ల గాలి తగలి కాస్త కునుకు తీస్తాం. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే కుదుపుల కారణంగా తలకు మెడకు గాయాలవ్వడం ఖాయం. స్లీపర్ క్లాస్ అయితే ఓకే అదే సీటింగ్ అయితే నిద్ర పోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. విమానం, కారు అయితే మరీ కష్టంగా ఉంటుంది. ఎలాంటి కుదుపులు లేకుండా హాయిగా నిద్రపోయే వారి కోసం మార్కెట్‌లోకి ఓ మాస్క్ లాంటి దిండు అందుబాటులోకి వచ్చింది. ఇది మాస్క్ తరహాలో ఉంటుంది. దాన్ని ధరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిద్రపోవచ్చు. గమ్యం చేరేవరకు హాయిగా గుర్రు పెట్టొచ్చు.

ఆన్‌లైన్‌లో వీటి ధర సుమారు రూ.500 ఉంది. మెడ,ముఖ భాగానికి ఇది రక్షణగా నిలుస్తుంది. ఈ దిండును తల చూట్టు మాస్కులా ధరించి కూర్చున్న చోటే సుఖంగా నిద్రపోవచ్చు. కార్లు, బస్సులు,విమానం ఎక్కడైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ దిండ్లు మార్కెట్లో వివిధ సైజ్‌లలో లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం
వీటిని కొనుగోలు చేసి మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసుకోండి.

Recommended For You