నిజానికి నేనే ట్రై చేద్దామనుకున్నా కానీ.. వీడియో వైరల్..

అమ్మే అయినా ఆమె మీద మాత్రం ఎందుకు ఆధారపడాలి.. నా కస్సలు ఇష్టం లేదు.. ఏదో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారని సరదాగా బురదలో ఆడుకుందాం రమ్మంటే వచ్చాను.. అమ్మకి చెబితే తిడుతుందేమో అని చెప్పకుండా వచ్చాను. నేను మరీ బుజ్జిగా ఉన్నానని బురద జోలికి వెళ్లొద్దంటూ అప్పటికే అమ్మ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది. నేను వింటేనా.. ఆమె లేని సమయం చూసి ఫ్రెండ్స్‌తో చెక్కేసాను. అందరం కలిసి ఎంత ఎంజాయ్ చేశామో. ఎప్పుడూ తెల్లటి స్వచ్చమైన నీటిని అమ్మ నా మీద పోస్తుంటే స్నానం చేస్తున్నట్టనిపించేది కానీ సబ్బు రుద్దుకున్నట్టు అనిపించేది కాదు. ఇప్పుడు ఈ బురదలో ఆడుతుంటే ఆ ఫీలింగ్ కలుగుతోంది.

Also Read : ఈ బీచ్‌లో రాళ్లు పుట్టి పెరుగుతాయి

ఇక ఆడుకోవడం అయిపోవడంతో ప్రెండ్స్ అంతా వెళ్లి పోయారు. నాకేమో ఎక్కడం రావట్లేదు. వాళ్లూ నన్ను పైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు కానీ.. నాకంటే వాళ్లు మరీ అంత పెద్ద వాళ్లేం కాదు. జస్ట్ నెలలే తేడా. అందుకే ఓ మాట అమ్మకి చెప్పేసి వెళ్లి పోయారు. దాంతో అమ్మ పరుగు పరుగున నా కోసం వచ్చింది. అయితే అమ్మకి చెప్పకుండా వచ్చాను కదా తిడుతుందేమో అని ఆమె సహాయం తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఎంతైనా అమ్మ కదా. అందుకే నన్ను ఏమీ అనకుండా పైకి తీసుకురావడానికి శత విధాల ప్రయత్నించింది. అయినా నేను తనని పట్టుకోలేకపోతున్నాను.. పైకి రాలేకపోతున్నాను. దాంతో పాపం తనే బురదలోకి దిగి నన్ను పైకి తీసుకు వచ్చింది. అందుకే ఐ లవ్యూ అమ్మ.

Recommended For You