ఎండకాలం సబ్జా గింజల జ్యూస్ తాగితే చాలు..ఇక..

chia-seeds

ఎండకాలం వచ్చింది కావున ఆరోగ్యంపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహర నియమాలపై శ్రద్ద పెట్టి ఎండ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలి. వేసవిలో ముఖ్యంగా దాహం అధికంగా వేస్తుంది. ఎన్ని తాగినా, ఏం చేసినా నోరు ఎండిపోతూనే ఉంటుంది. చల్లగా ఉన్నవి ఏవైనా తాగలనిపిస్తుంది.
ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏది పడితే అది తాగకుండా సహజమైన,ఆరోగ్యానికి మెలు చేసే వాటిని తాగడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండాకాలం వస్తే దాహం ఓ పట్టాన తీరదు. అలాంటప్పుడు సహజమైన సబ్జా గింజలు జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు తొందరగా దాహం వేయదు. ఇవి అన్ని కిరాణ స్టోర్‌ల్లో లభిస్తాయి. వీటిని ఓ చెంచాడు ఓ గ్లాసు నీటిలో వేసి ఓ పావు గంట సేపు అలాగే ఉంచాలి. అవి నీటిలో నానడం వలన చక్కగా ఉబ్బుతాయి. ఆ నీటికి కాస్త చక్కెర,నిమ్మరసం వంటివి కలుపుకుని తాగితే చాలు ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కూల్‌డ్రింక్స్ లాంటివి తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కావున సహజమైన సబ్జా గింజల్ని తాగితే మంచి ప్రయోజనాలను పోందవచ్చు . దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

శరీరంలో ఉండే అదిక బరువు తగ్గించడంతో పాటు డైటింగ్ చేసేవాళ్లకు మేలు కలుగుతుంది. సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తాయి. జ్వరం వచ్చిన వారికి ఎంతో మేలు చేస్తాయి. ఉబ్బరం, ఆసీడిటీ, అజీర్తి లాంటి సమస్యలకు చెక్ పెడతాయి. ఈ గింజలను తరుచూ తీసుకోవడం వల్ల గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటివి తగ్గుతాయి. శ్వాసకోస వ్యాధుల్ని కూడా తగ్గించుకోవచ్చు. బయట లభించే సాప్ట్ డ్రింక్స్ బదులుగా ఇన్ని ఉపయోగాలు ఉన్న సబ్జా గింజలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

Recommended For You