సుకుమార్ – మహేష్ మూవీ.. మధ్యలో బన్నీ ఎంట్రీ..

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ కొత్త సినిమా రాబోతుంది. ఇదే టాలీవుడ్లో ఇప్పుడు హాట్ న్యూస్. అదేంటీ.. సుకుమార్ త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు కదా.. మధ్యలో బన్నీ సినిమా ఎలా ట్రాక్ ఎక్కింది అని డౌట్ వస్తుందా.. ఈ విషయంపై టాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తాడని టాలీవుడ్‌లో బలంగా వినిపించింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తాను నటించడం లేదని మహేష్ ట్వీట్ చేశాడు. దీంతో ఇటు ఫ్యాన్స్‌తో పాటు అటు టాలీవుడ్‌లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇక్కడే మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. మహేష్ ట్వీట్ చేయడానికి ముందు రోజే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్‌కి సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీ తరువాత సుక్కు, బన్నీలు కలిసి మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Recommended For You