షుగర్‌తో బాధపడుతున్నవారు అల్లం తీసుకుంటే..

కూరల్లో వేసుకుంటే రుచిగా ఉంటుంది. టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలుబు, దగ్గు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల్ని నివారిస్తుంది. అందుకే అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది.

తాజా పరిశోధనల ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు అల్లంని వారి డైట్‌లో చేర్చుకుంటే మంచిదంటున్నారు. మధుమేహంతో బాధపడేవారి బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ లెవల్స్‌ని పెంచుతుంది. అందుకే అల్లాన్ని కొద్ది మోతాదులో రోజూ తీసుకుంటే షుగర్ కారణంగా వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.

అంతేకాదు అల్లంని తీసుకోవడం వలన గుండెసంబంధిత సమస్యలు రావని పలు పరిశోధనల్లో తేలింది. ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఆకలిని పెంచుతుంది. వివిధ రకాలైన క్యాన్సర్లను నిరోధిస్తుంది. శ్వాస కోశ సమస్యలను మెరుగుపరుస్తుంది. కీళ్ల వ్యాధులతో బాధపడేవారికి అల్లం ఉపశమనాన్ని ఇస్తుంది. లైంగిక కార్యకలాపాలను వృద్ధి చేస్తుంది.

విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఉన్నాయి. రక్త శుద్దికి, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టనివ్వకుండా అల్లం సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవాలనే వారిక్కూడా అల్లం ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది.
అల్లం టీ తయారు చేసే విధానం..
మెత్తగా దంచిన అల్లం : 1 టీ స్పూన్
టీ పొడి : 1 టీ స్పూన్ (ఒక కప్పుకు)
నీళ్లు : 3 కప్పులు
తేనె : 1 టీ స్పూన్
నిమ్మరసం : 1 టీ స్పూన్
పాలు : అరకప్పు
తయారీ విధానం..
గిన్నెలో నీటిని తీసుకోవాలి. అందులో అల్లం పేస్ట్ వేసి మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో టీ పోడి వేసి మరిగించాక పాలు పోయాలి. బాగా మరిగాక దించి తేనె నిమ్మరసం వేసి వేడిగా తాగాలి. షుగర్ ఉన్నవారు తేనె వేసుకోకుండా తీసుకోవాలి.