మరిన్ని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి బజాజ్ బైక్ డామినర్..

టూ వీలర్‌లో అత్యధిక మార్కెట్ ఉన్న కంపెనీగా బజాజ్ చెలామణిలో ఉంది. ఈ కంపెనీ తయారు చేసే అన్ని టూ వీలర్లలో కెల్లా అత్యంత శక్తివంతమైన బైక్ డామినర్‌ను మరి కొద్ది రోజుల్లో మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.8 లక్షలు ఉండొచ్చంటున్నాయి మార్కెట్ వర్గాలు.

కంపెనీ ఈ కొత్త బైక్‌లో పలు మార్పులు చేసింది. కలర్ ఆప్షన్స్‌లో గ్రీన్‌ కలర్‌ను చేర్చింది. కంపెనీ బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో అప్‌సైడ్ డైన్ ఫ్రంట్ సస్పెన్షన్ (యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్) ఫీచర్‌ను అమర్చింది. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో కూడా మార్పులు చేసింది. డబుల్ బ్యారెల్ ఎక్స్‌హాస్ట్, కొత్త సైడ్ స్టాండ్ వంటి వాటిని జోడించింది. అలాగే రియర్ వ్యూ మిర్రర్లను రీడిజైన్ చేసింది.

ఇంజన్ మాగ్జిమమ్ పవర్ 39.9 హెచ్‌పీ @ 8650 ఆర్‌పీఎంగా, ఇంజన్ మాగ్జిమమ్ టార్క్ 35 ఎన్ఎం @ 7000 ఆర్‌పీఎంగా ఉంటుంది. ఇంతకు ముందు వేరియంట్స్‌లో ఇంజన్ మాగ్జిమమ్ పవర్ 35 హెచ్‌పీ @ 8000 ఆర్‌పీఎంగా, ఇంజన్ మాగ్జిమమ్ టార్క్ 35 ఎన్‌ఎం @ 6,500 ఆర్‌పీఎంగా ఉంది. దీన్ని బట్టి రాబోయే బజాజ్ డామినర్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా దీనిలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) స్టాండర్డ్ ఫీచర్ ఉంది. ఇదివరకటి బైకులకంటే 30 వేల అధిక ధరతో ఉన్నా కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్ల్యూజీ 310, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు డామినర్ పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Recommended For You