అనిల్ రావిపూడికి బంపరాఫర్

anil-ravipudi
anil-ravipudi

వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికి మరో గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం సాధించి స్టార్ హీరోల చూపుని తనవైపుకు తిప్పుకున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించిన అనిల్ రావిపూడి లైన్లోకి వచ్చాడు. ఇదే సమయంలో సుకుమార్‌తో సినిమా చేయాల్సి ఉన్న మహేష్ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. ఇక మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్‌ని అనిల్‌ కొట్టేశాడు. అందుకు అనిల్ చెప్పిన లైన్ నచ్చడం కూడా ఓ కారణం. అందుకే వెంటనే డేట్స్ కూడా ఇచ్చేసాడు మహేష్. ఈ క్రేజీ కాంబినేషన్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేయడానికి నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారట. ఇద్దరు నిర్మాతలు నేనంటే నేనంటున్నారు. మరి మహేష్ ఆ అవకాశం ఎవరికి ఇవ్వాలా అని సమాలోచనలో పడ్డాడట. ఓపక్క ఆల్రెడీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్ఫార్మ్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఇతను ఒక్కరే నిర్మిస్తారా లేక మరో నిర్మాత అనిల్ సుంకరని కూడా కలుపుకుంటారా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రష్మిక మందన రెడీ అయిపోయింది.