పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పొడి.. కిలో రూ.50,000

ఏంటో.. మంచిది అని తెలిస్తే ఎంత రేటు పెట్టి అయినా కొనేస్తుంటారు. అందుకేనేమో పునుగు పిల్లి విసర్జనతో తయారయ్యే కాఫీ పొడికి అంత డిమాండు. ఏకంగా రూ.50వేలు పెట్టి మరీ కొంటున్నారు. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంత ఖరీదు పెట్టి కొంటున్నారు సంపన్న వర్గాల వారు. దీన్ని ‘సివెట్ కాఫీ’ లేదా ‘కోపీ లువాక్’ అని పిలుస్తారు. ఈ ఖరీదైన కాఫీ పొడి తయారయ్యేది భారతదేశంలోని కర్నాటక రాష్ట్రం కొడగు(కూర్గ్) జిల్లాలో తయారు చేస్తారు. సివెట్ కాఫీ తయారయ్యే విధానం విచిత్రంగా ఉంటుంది. సాధారణ కాఫీ గింజల్ని పునుగు పిల్లి తిని విసర్జిస్తుంది. దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని గుర్తించిన పరిశోధకులు వాటిని సేకరించి కాఫీ పొడి తయారు చేసే ప్రక్రియను చేపట్టారు. దీనికి డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఈ కాఫీ పొడి గల్ఫ్, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
దీంతో కూర్గ్‌లో ఈ కాఫీ పొడి తయారీ చిన్న తరహా పరిశ్రమగా మారిపోయింది. ఇంతకు ముందు ఏడాదికి 20 కిలోల కాఫీ మాత్రమే తయారయ్యేది. అయితే దానికున్న డిమాండ్ కారణంగా పునుగు పిల్లుల్ని పెంచడం ఎక్కువైంది. ఇప్పుడు ఏడాదికి 500 కిలోల వరకు ఈ కాఫీ పొడిని తయారవుతుందని అంచనా. అయితే ఇందులో క్వాలిటీలు ఉన్నాయి. తక్కువ క్వాలిటీ రూ.10 వేలు ఉంటే, హై క్వాలిటీ రూ. 50 వేల వరకు ఉంటుందని అంచనా. స్థానికంగా అయితే ఈ కాఫీ పొడి కిలో ధర రూ.8 వేల వరకు ఉంటుందట. కూర్గ్‌లోని ‘Ainmane’ ఔట్‌లెట్‌లో ఈ కాఫీ పొడి దొరుకుతుంది.

Recommended For You