ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న కౌశల్ బ్లఫ్ వేషాలు..

koushal bluff vesalu

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ బ్లఫ్ వేశాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.. బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన తర్వాత ఒక్కసారిగాసెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న కౌషల్ అదే మత్తులో తూగుతున్నాడు. బిగ్ బాస్ రెండో సీజన్ విజేతగా నిలిచిన తనకు ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. అయితే అది అబద్ధమని తేలిన కొన్ని రోజులకే..

బిగ్ బాస్ టూ సీజన్ లో తనకు 40 కోట్ల ఓట్లు వచ్చాయని.. అంత పెద్ద సంఖ్యలో ఓట్లు రావటంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తనను అప్రోచ్ అయ్యారంటూ చెప్పాడు.. అయితే అది కూడా అబద్ధమని తేలిపోయింది.. ఇలా బిగ్ బాస్ లో విన్ అయిన కౌశల్ బిల్డప్ కోసం ఏవేవో చెప్పి అడ్డంగా దొరిపోయాడు.. అంతేకాదు అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీ నుంచి తనకు డాక్టరేట్ కూడా ఆఫర్ చేశారని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అది నిజామా కాదా అని తెలుసుకునేందుకు చాలా మంది ట్రై చేశారు. నిజానికి అదికూడా అబద్ధమని తేలిపోయింది.