కీటో డైట్ ద్వారా వచ్చే భారీ నష్టమిదే..!

low-carb-keto-diets-raise-risk-heart-rhythm-disorders

ఒంటిచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కీతో డైట్ కూడా ఒకటి.. మూడుపూటలా ఆహరం తీసుకోకుండా డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, మాంసాహారం(ఎక్కువగా చికెన్) మాత్రమే తీసుకుంటుంటారు.. కీటో డైట్ వలన మంచి ఫలితాలే ఉన్నా.. దీని వలన భవిశ్యత్ లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు కొందరు నిపుణులు. ఈ కీటో డైట్ పై చైనాకు చెందిన కార్డియాలజిస్ట్‌.. ప్రముఖ రచయిత సన్‌ యాట్‌-సేన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ జుంగ్‌ ఆధ్వర్యంలో పరిశోధన జరిపారు. దీనివలన భవిశ్యత్ లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 4,000 మంది ఆహారపు అలవాట్లను రెండు దశాబ్ధాల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. కీటో ఆహారంలో భాగంగా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తగ్గించడం ద్వారా గుండెకొట్టుకునే వేగం లయతప్పుతుందని, ఇది గుండె పోటు వంటి తీవ్ర అనర్ధాలకు దారితీస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

Recommended For You