ఎంబీఏ పూర్తి చేసి దొంగ నోట్లు ముద్రిస్తున్న యువతి.. చివరకు..

ఎంబీఏ పూర్తి చేసిన యువతి.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. ఇంట్లోనే రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లను ఫ్రింట్‌చేసి.. నగరంలో పలుచోట్ల మారుస్తూ వచ్చింది. కానీ తప్పు చేస్తే జైలు శిక్ష తప్పదనే విషయం గ్రహించలేకపోయింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది.

చెన్నైకు చెందిన యువతి కుటుంబం పడుతున్న ఇబ్బందుల కారణంగా.. తెలిసిన వారి వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేసింది. దీంతో అప్పిచ్చినవారు తిరిగి ఇవ్వమన్ని ఒత్తిడి చేయడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. యూట్యూబ్‌లో చూసి మరీ దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే నకిలీ నోట్లను ముద్రించింది. వీటిని అక్కడక్కడ.. మారుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ షాపుకు వెళ్లి నకిలీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చి సామాన్లు కొన్నది. ఆ షాపు ఓనర్‌కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

Also Read : కోరిక తీరలేదని పురుషుడుని హత్య చేసిన..

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఇంటి నుండి నకిలీ నోట్లతో పాటు వాటిని ముద్రించే ప్రింటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recommended For You