అందంగా కనిపించాలంటే రోజూ..

beauty-tips

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన దశ యవ్వనం . జీవితంలో మనకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు ఆ దశలోనే ఉంటాయి. యవ్వనం తెచ్చిన కొత్త అందాలను ఆస్వాదించాలని యుక్త వయస్సు పరుగులు పెడుతుంది. ఆ వయస్సులో ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి కంటే అందంగా కనిపించాలని తాపత్రయం ఉంటుంది.

అమ్మాయిల గురించి అయితే చెప్పనవసరం లేదు. మంచి లుక్‌ కనిపించడం కోసం వారు చేయని ప్రయత్నాలు ఉండవు. అందంగా కనిపించడం కోసం చాలా టిప్స్ పాలో అవుతారు. అయితే వాటిలో కొన్ని చేస్తే మంచిది..కొన్ని చేయకుంటే మంచిది. అవి ఏంటో ఓసారి తెలుసుకుందాం!

రోజూ నీరు తాగడం మంచిది. కావల్సినంత నీరు తాగకపోతే శరీరం పొడిగా మారుతుంది. ముఖంపై నల్లని మచ్చలు,మెుటిమలు రాకుండా ఉండాలంటే రోజు నీరు ఎక్కువగా తాగాలి. చాలా మంది యువతీయువకులు నీటిని తాగకుండా దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటారు. దీని వల్ల శరీరం షైన్ అవ్వదు. టీనేజర్స్ అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మేకప్ పై ఎక్కువగా మెుగ్గు చూపుతుంటారు. అయితే అమ్మాయిలు మేకప్‌కి దూరంగా ఉంటేనే మంచిది. నడివయస్సు వారు
అందంగా కనిపించడం కోసం మేకప్ వాడుతున్నారంటే ఓ అర్థం ఉంది. కానీ యూత్‌కి అది అవసరం లేదు సహజ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు యవ్వనంగా అందంగా కనిపించవచ్చు. మేకప్‌లో రసాయనాలు స్కిన్‌ను పాడు చేస్తాయి.

ఇక జుట్టు విషయానికి వస్తే చాలా మంది యువకులకు యుక్త వయస్సులోనే తెల్ల జుట్టు వస్తుంది. వాటిని కవర్ చేసుకోవడానికి జుట్టుకు రకరకాల రంగులు, షేడ్స్ వేస్తుంటారు. తెల్ల జుట్టు రావడానికి కారణం పోషకాల లోపం సరియైన ఆహారనియామాలు పాటిస్తే వాటిని నివారించవచ్చు. ఫ్యాషన్ లుక్ కోసం ఏవేవో కెమికల్స్ ను పూసి మీ అందమైన జుట్టును పాడుచేసుకోకండి.

కళ్ళకు చాలా మంది అమ్మాయిలు మేకప్ వేస్తుంటారు. ఇది మంచిది కాదు. వీటివల్ల ఇబ్బందులకు గురవుతారు. అవి కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. కళ్ళకు నల్లటి రంగులు లాంటివి పూయడం ద్వారా చూపు మందగించే ప్రమాదం ఉంది. కళ్ళు అందంగా కనిపించాలంటే విటమిన్ పుడ్ ఎక్కువగా తీసుకొవాలి. రోజూ వాటిని శుభ్రం చేసుకుంటు ఉండాలి.

Recommended For You