కూలిన విమానం.. 157 మంది పాసింజర్స్..

కొలంబియాలో ప్రయాణికుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మేయర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.

ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం.. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమానంలో 149 మంది పాసింజర్స్, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు.

విమాన ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కానీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వివరించారు.

Also Read : ఫామ్‌-7 దరఖాస్తు నింపితే ఓటుకు రూ. 2500 ఇస్తామంటూ..