పోలీసులపై దాడులకు తెగబడ్డ వ్యాపారులు

business man attack on police in bhungiri distric

పీడియస్‌ బియ్యం అక్రమ రవాణను అడ్డుకున్న ఎస్‌ఓటీ పోలీసులపై దాడులకు తెగబడ్డారు వ్యాపారులు. యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, పుటగూడెం తాండలో ఈదారుణం చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన బియ్యం వివరాలను స్వీకరిస్తున్న ఎస్‌ఓటీ పోలీసులు సుబ్బరాజు, సంజీవరెడ్డి, ఎస్‌ సురేందర్‌ రెడ్డిలపై .. అక్కడే కాపు కాసి ఉన్న బియ్యం అక్రమ వ్యాపారం చేసే వ్యాపారస్తులు వారితో ఘర్షణకు దిగారు. అంతే కాకుండా వారి ద్విచక్ర వాహనాన్ని దగ్దం చేశారు.

ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారు వెంటనే యాదగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి ఏసీపీ మనోహోర్ రెడ్డి బృందం చేరుకుంది. గాయపడిని వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. . పోలీసు సుబ్బరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఘర్షణ పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు