కొత్తవారికి అవకాశం దిశగా ప్రయత్నం జరుగుతోంది : నటీ కరాటే కళ్యాణి

maa elections in hyderabad

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పలువురు నటీ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటన్నారు. మా అసోసియేషన్ లో మొత్తం 785 మంది సభ్యులు ఉన్నారు. జూబ్లిహిల్స్ ఫిల్మ్ నగర్ లో జరుగుతున్నఈ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆరు గంటలకల్లా ఫలితాలు తేలిపోయే అవకాశాలున్నాయి.

పోటాపోటీ హామీలు, విమర్శలతో మా అసోసియేషన్ పోలింగ్ గతేడాది తరహాలోనే ఈ సారి కూడా రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శివాజీరాజా, నరేష్ ఎవరికి వారు విజయం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే..అసోసియేషన్ లో 785 మంది సభ్యులు ఉన్నా..గతంలో ఎన్నడూ 300లకుపైగా ఓట్లు పోలవలేదు. కానీ, ఈ సారి పాత డిజిట్ ను ఖచ్చితంగా క్రాస్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఓటు హక్కు వినియోగంచుకుంటారని రెండు ప్యానెళ్లు ఆశాభావంతో ఉన్నాయి.

మా అసోసియేన్ మార్పు కోరుకుంటోందని అన్నారు అధ్యక్ష పదవి పోటీ చేస్తున్న నరేష్. తమది షోకేజ్ ప్యానెల్ కాదని..వర్కింగ్ ప్యానెల్ అని అంటున్నారు. మా బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాన్యం ఇస్తామని నరేష్ అన్నారు. మా ఎన్నికల్లో సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ హీట్ ఉందని అన్నారు సునీల్. ప్యానెల్స్ మధ్య విమర్శలపై స్పందిస్తూ ఎవరి మనస్తతత్వం వారిదని అన్నారాయన.

మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగినా సాయంత్రానికల్లా అంతా చక్కబడుతుందని అంటున్నారు నటీనటులు. తమది అంతా ఓ కుటుంబమని అంటున్నారు. గతంలో ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలు ఈ సారి పోలింగ్ ద్వారా ఏకగ్రీవంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.

ఈ సారి కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు నటీ కరాటే కళ్యాణి. ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ కల్పించేలా షీ టీమ్స్ ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అలాగే దిగుమతి నటీనటులను తగ్గించి లోకల్ టాలెంట్ కు ప్రధాన్యత ఇచ్చేలా ప్రయత్నిస్తామని చెబుతున్నారామె.