కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకుంది వీరే..

maa elections in hyderabad

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై నరేష్ పోటీకి దిగారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అసోసియేషన్ లో మొత్తం 800 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇప్పటికే నరేష్ , శివాజీరాజా, జీవిత రాజశేఖర్ దంపతులు, సాయిధరమ్ తేజ్ , పృథ్వి , జేడీ చక్రవర్తి, హీరోయిన్ రవళి , పరుచూరి గోపాల కృష్ణ, ఉత్తేజ్ , నాగిరెడ్డి, కృష్ణుడు, కరాటే కళ్యాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.