ఈసారి కూడా ఓటు హక్కు వినియోగించుకోని ఆ హీరోయిన్లు..

maa elections updates

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ‘మా’లో మొత్తం 785 మంది సభ్యులు ఉంటే..ఇప్పటివరకు దాదాపు రెండు వందల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో దాదాపు 50 మంది వరకు రెండు ప్యానెళ్ల సభ్యులే ఉన్నారు. జూబ్లిహిల్స్ ఫిల్మ్ నగర్ లో జరుగుతున్నఈ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శివాజీరాజా, నరేష్ ప్యానెల్ సభ్యులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకోవటంతో ఫిల్మ్ నగర్ లో హడావుడి నెలకొంది. చిరంజీవితో పాటు పలువురు నటీనటులు ఓటు వేశారు.

పోటాపోటీ హామీలు, విమర్శలతో మా అసోసియేషన్ పోలింగ్ గతేడాది తరహాలోనే ఈ సారి కూడా రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శివాజీరాజా, నరేష్ ఎవరికి వారు విజయం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే..అసోసియేషన్ లో 785 మంది సభ్యులు ఉన్నా..గతంలో ఎన్నడూ 300లకుపైగా ఓట్లు పోలవలేదు. కానీ, ఈ సారి పాత డిజిట్ ను ఖచ్చితంగా క్రాస్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఓటు హక్కు వినియోగంచుకుంటారని రెండు ప్యానెళ్లు ఆశాభావంతో ఉన్నాయి. అయితే..యథావిధిగానే ఈ సారి కూడా టాప్ హీరోలు, యంగ్ హీరోలు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేదు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంతగా బిల్డింగ్ నిర్మించాలని అన్నారు నటుడు అలీ. గతంలో చాలా మంది హామీ ఇచ్చినా..ఆచరణలోకి మాత్రం తీసుకురాలేదని ఆరోపించారు. మా అసోసియేషన్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు అలీ.