ఘోర విషాదం : కారులో సజీవదహనమైన తల్లీకూతుళ్లు..

delhi woman and daughters dead car catches fire flyover

ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఫ్లైఓవర్‌పై జరిగింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా అతని భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి పనిమీద బయటికి వెళ్లారు. అయితే కారు అక్షర్‌ధామ్‌ గుడివద్దకు రాగానే కారులో గ్యాస్‌ లీక్‌ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో డ్రైవర్‌ సీట్లో ఉన్న ఉపేంద్ర ఒక కూతురుని తీసుకుని బయటకు దూకేశాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి భార్య రంజనా మిశ్రా, కూతుళ్లు నిక్కీ, రిధి సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా భార్య పిల్లలు కాలి బూడిద అవ్వడంతో ఉపేంద్ర ఎటువంటి సమాచారం ఇచ్చే పరిస్థితిలో లేడని పోలీసులు చెబుతున్నారు.