హోండా కార్లపై ఆఫర్లు.. ఈ అవకాశం..

కారు కొనాలనుకుంటున్న మీ కల తీరే అవకాశం వచ్చింది. హోండా కంపెనీ పలు మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బ్రియో, అమేజ్, డబ్ల్యూఆర్‌-వి, సిటీ, బీఆర్-వీ వంటి మోడళ్లపై ఇన్సూరెన్స్, యాక్ససిరీస్, ఎక్సేంజ్ బోనస్ వంటి సదుపాయాలు కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అని తెలియజేసింది కంపెనీ.

బ్రియో మోడల్ తయారీ కార్లను 2018లోనే నిలిపివేసింది. దాంతో మిగిలిపోయిన ఆ స్టాక్‌ని కూడా ఇప్పుడు ఈ అఫర్లో ఉంచింది. ఈ కారుపై 19,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇక ఎంఐఎస్‌పీ కింద రూ.1 కే ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తోంది. హోండా పోర్ట్‌ఫోలియోలో కొత్త జనరేషన్ అమేజ్‌కు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఈ మోడల్‌కు ఎక్స్‌టెండెంట్ ‌వారంటీ అందిస్తోంది.

ఇంకా ఈ కారుపై ఎక్సేంజ్ బోనస్‌ కూడా ఉంది. బోనస్ రూపంలో రూ.25,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. అలాగే రూ.1కే రూ.25,000 విలువైన ఇన్సూరెన్స్ సొంతం చేసుకోవచ్చు. సిటీ సెడాన్ కారుపై రూ.1కే రూ.32,000 విలువైన బీమా పొందవచ్చు. ఎక్సేంజ్ రూపంలో రూ.30,000 ప్రయోజనాలు అందుతాయి. రూ.10,000 విలువైన యాక్ససిరీస్‌ను పొందవచ్చు. డబ్ల్యూఆర్ వీ కారుపై కూడా రూ.1కే రూ.25,000 ఇన్సూరెన్స్ పొందవచ్చు.

ఎక్సేంజ్ బోసన్ కింద రూ.17,000 పొందవచ్చు. బీఆర్‌వీ కారుపై రూ.1కే రూ.33,500 ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఎక్సేంజ్ రూపంలో రూ.50,000 బోనస్ లభిస్తుంది. అలాే రూ.16,500 విలువైన యాక్ససిరీస్ పొందవచ్చు. ఎక్సేంజ్ రూపంలో కాకుండా బీఆర్‌వీ కారును కొనుగోలు చేస్తే ఇన్సూరెన్స్‌తో పాటు రూ.26,500 విలువైన యాక్ససిరీస్‌ని సొంతం చేసుకోవచ్చు. అయితే సివిక్, సీఆర్‌-వీ కార్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.

Recommended For You