మా ఎన్నికల్లో నరేశ్‌ ప్యానల్‌ అద్భుత విజయం

maa elections naresh pannel sensational victory

ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో నరేశ్‌ ప్యానల్‌ అద్భుత విజయం సాధించింది. అధ్యక్షుడిగా నరేశ్‌, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌, జాయింట్‌ సెక్రటరీ గౌతమ్‌ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం.

మా ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మాలో మొత్తం 745 ఓట్లు ఉండగా, 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించగా, ఈసారి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.