‘జెర్సీ’ రీలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటిస్తున్న మూవీ ‘జెర్సీ’ . ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది. 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుందన్నారు దర్శకుడు.

‘జెర్సీ’ మూవీని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్.

Also Read : వేశ్య పాత్రని తెలిసే.. ఇష్టంతో.. : రమ్య కృష్ణ