మళ్లీ తెరపైకి నయీం ముఠా ఆగడాలు.. ఐదుగురు అరెస్ట్

nayeem gang halchal five members arested

మళ్లీ తెరపైకి గ్యాంగ్‌స్టర్‌ నయీం ముఠా ఆగడాలు వస్తున్నాయి. ముఠా సభ్యులు నయీమ్ బీనామీ ఆస్తులను మరొకరిపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో భువనగిరి పోలీసులు ఐదుగురు నయీం అనుచరుల అరెస్ట్ చేశారు. ఇందులో నయీం భార్య హసీనాబేగంతో పాటు పాశం శ్రీనివాస్, అబ్దుల్‌ ఫహీం.. అబ్దుల్‌ నాజర్, తుమ్మ శ్రీనివాస్‌ ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరు నయీం బినామీ ఆస్తులపై దృష్టి పెట్టారు. అటు.. నయీం అనుచరుల మీద నిఘా వైఫల్యంపై రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ సీరియస్ అయ్యారు. యాదాద్రి డీసీపీ రాంచంద్రారెడ్డిని సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేదు లేదని మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు.