వేశ్య పాత్రని తెలిసే.. ఇష్టంతో.. : రమ్య కృష్ణ

రమ్యకృష్ణ.. పదహారేళ్ల పడుచుపిల్లలా యువహృదయాలను కవ్వించగలదు.. అత్తగారిగా పెత్తనాన్ని చెలాయించగలదు.. శివగామిలా ఘర్జించనూ గలదు. నాలుగుపదుల వయసులోనూ చెదరని అందంతో మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. తాజాగా ఓ సినిమాలో వచ్చిన అవకాశాన్ని తనకంటే ముందు మరో నటి నదియాను అడిగితే ఆమె తిరస్కరించిందట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రను ఛాలెంజింగ్ తీసుకుని నటించింది.

త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వం వహించిన ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో రమ్య శృంగారతార పాత్ర పోషించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. రమ్యకి ఈ వయసులో ఇలాంటి పాత్ర చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని చెవులు కొరుక్కునేవారికి ఓ ఇంటర్వ్యూలో రమ్య ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.

‘ ఈ చిత్రంలో నేను వేశ్య పాత్రలో నటించాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే .. ఈ పాత్ర మరో ఎత్తు. ఓ సన్నివేశం కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నాను. ఆ సన్నివేశం చిత్రీకరించడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి నా కంటే, నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్న వారే షాకయ్యారు. కొన్ని పాత్రలు డబ్బు కోసం చేస్తాం, మరి కొన్ని పాపులారిటీ కోసం, ఇంకొన్నింటిని పేరు కోసం చేస్తాం, కొన్ని పాత్రలు మనసు హత్తుకునేవి వుంటాయి.

దర్శకుడు ఆ పాత్రని మలచిన తీరు ఎంతో ఆకర్షిస్తుంది. దాంతో జయాపజయాలను పక్కన పెట్టి ఎంతో ఇష్టంతో చేస్తుంటాం. అలాగే ఇ సినిమాలో వేశ్య పాత్రని కూడా నేను ఎంతో ఇష్టపడే చేశాను’ అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 29న సూపర్ డీలక్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recommended For You