దోషులను ఉరి తీసే తలారీ ఉద్యోగం.. నోటిఫికేషన్ ఇస్తే..

దేశం ఏదైనా నిరుద్యోగం యువతీ యువకులను పట్టిపీడిస్తోంది. చదివిన చదువుకి మంచి ఉద్యోగం రాక, ఖాళీగా ఉండే బదులు ఏ ఉద్యోగం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. దోషిని ఉరికంబం ఎక్కించే తలారీ ఉద్యోగం చేయాలంటే క్వాలిఫికేషన్ కంటే గుండెనిబ్బరం కావాలి. కళ్ల ముందే ఓ నిండు ప్రాణాన్ని నిర్ధాక్షణ్యంగా తన చేతుల మీదుగా బలి చేయాలంటే మరెంతో మనోధైర్యం కావాలి. ఈ ఉద్యోగానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు జైళ్ల శాఖ అధికారులు.

నిజానికి ఈ ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ శ్రీలంకలో మాత్రం తలారీ ఉద్యోగం కోసం వందల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ఈ ప్రకటన సాక్ష్యంగా నిలుస్తోంది. మాదక ద్రవ్యాలను రవాణా చేసేవారికి, హంతకులకు, మహిళలను లైంగికంగా వేధించిన వారికి ఉరిశిక్ష విధిస్తుంది ఇక్కడి న్యాయస్థానం.

ఇప్పటి వరకు 48 మంది ఖైదీలను ఉరితీసింది న్యాయస్థానం. అయితే ఈ మధ్య ఖైదీలను ఉరితీసేందుకు తలారీలు లేని కారణంగా చాలా మంది ఖైదీలు జైళ్లలోనే మగ్గుతున్నారు. దాంతో తలారి అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది జైళ్ల శాఖకు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ఉద్యోగం కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి.

ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారిలో ఓ అమెరికన్ పౌరుడు కూడా ఉండడం విశేషం. ఇంతకీ జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. 1971 తరువాత శ్రీలంకలో ఏ ఖైదీని ఉరి తీయలేదట. 43 ఏళ్లుగా అక్కడి ఖైదీలు జైళ్లలోనే మగ్గుతున్నారు.

Recommended For You