అసభ్యకరమైన కామెంట్లతో సన్నీని ఏడిపించిన నెటిజన్..

అందరి జీవితం పూల బాట కాదు. పరిస్థితులకు తలవొగ్గి కొందరు అలాంటి దారిలో పయనించాల్సి వస్తుంది. జీవితం విలువ తెలుసుకుని సక్రమమైన మార్గంలో పయనించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ బాటలో విజయాలెన్నో వరిస్తాయి. కానీ గతం తాలూకు ముళ్లు ఇంకా గుచ్చుకుంటూనే ఉంటాయి. మరిచిపోదామని ప్రయత్నిస్తుంటే కొందరు కావాలని పాత జ్ఞాపకాలను తవ్వి బాధపెడుతుంటారు.

సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వివాహం చేసుకుంది. ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకుంది. సరోగసీ ద్వారా మరో ఇద్దరు పిల్లలను పెంచుతోంది. ఇలా తన జీవితాన్ని అందంగా మలచుకుంది. ఈ నేపథ్యంలో బుల్లితెరపై వ్యాఖ్యాతగా సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ‘పించ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పోస్టులపై, ఫొటోలపై నెటిజన్లు చేసే కామెంట్లు, వారు అడిగే ప్రశ్నల గురించి చర్చించడం ఈ షో ప్రత్యేకత. అర్బాజ్ సన్నీ కెరీర్‌కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే నెటిజన్లు చేసిన కామెంట్లు చదువుతున్నారు. అందులో సన్నీ పాత జీవితంపై ఓ నెటిజన్ అసభ్యకరంగా కామెంట్ రాసాడు. అర్బాజ్ అది చదివేసరికి సన్నీకి అక్కడే బోరున విలపించింది.

ఆమెను ఓదార్చేందుకు అర్బాజ్ చాలా ప్రయత్నించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించినా ఇంకా అవే గుర్తు చేస్తూ బాధపెడుతున్నారని సన్నీ కన్నీరు మున్నీరయింది. ఇదిలా ఉండగా అర్బాజ్, సన్నీ జంటగా ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంలో నటించారు.

Recommended For You