బైక్, కారు కొనాలనుకుంటున్నారా.. ఈ నెలాఖరు వరకు ఆగితే..

ఇప్పుడే కొన్నారంటే ఆ తరువాత ఎంతో బాధపడవలసి వస్తుంది. అదే 3 వారాలు ఆగిన తరువాత కొన్నారనుకోండి బైక్‌పై రూ.20 వేల వరకు, కారు పై లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. అదెలా అంటే కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ద్వారా. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీకి సంబంధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది.
ఫేమ్ 2 పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది.
35,000 కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందవచ్చు.
హైబ్రిడ్ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000-20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు.
అలాగే 5 లక్షల ఈ-రిక్షాలకు ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది.
7,090 ఈ-బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సీడీ లభించనుంది.
2019-20 సంవత్సరంలో రూ.1,500 కోట్లు,
2020-21లో రూ.5,000 కోట్లు,
2021-22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు.
బస్సులకు ధరలో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20% ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.

Recommended For You