కాలేజ్‌ దగ్గర దారుణం.. ఇంటర్ మీడియట్‌ విద్యార్థి గొంతు కోసిన..

knife-attack-man-kota-rajasthan

నల్గొండ జిల్లా పాలిటెక్నిక్‌ కాలేజ్‌ దగ్గర దారుణం జరిగింది. మాచర్ల తరుణ్‌ కుమార్‌ అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిపై దాడి చేసి గొంతు కోసారు కొందరు దుండగులు. అయితే రాత్రంతా తరుణ్‌ తీవ్ర గాయాలతో అలాగే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు విషయం చెప్పి.. ఆస్పత్రిలో చేర్పించారు.

Also Read : భారీ సెక్స్‌ రాకెట్‌ .. విద్యార్థినులే టార్గెట్‌ .. 1050 అసభ్యకర వీడియోలు..

తరుణ్‌ ప్రస్తుతం ప్రగతి కాలేజీలో ఇంటర్‌ సెకెండ్ ఇయర్‌ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరువాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You