శ్రీశైలం దేవస్థానం పీఆర్‌వో కళ్లలో కారం కొట్టి..

శ్రీశైలం దేవస్థానంలో పీఆర్వోగా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలవడంతో అతన్ని గుంటూరు తరలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని కలిసి వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు.. శ్రీనివాసరావు కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమయ్యేలోపు నిందితులు పారిపోయారు.

Also Read : కాలేజ్‌ దగ్గర దారుణం.. ఇంటర్ మీడియట్‌ విద్యార్థి గొంతు కోసిన..