‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పై ఈసీకి ఫిర్యాదు

tdp complaints election commission over lakshmis ntr

నిర్మాణంలో ఉండగానే వివాదస్పదమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలపై కూడా వివాదం ముసురుకుంటోంది. ఈ నెల 22న సినిమా విడుదలను అపాలంటూ టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సినిమా విడుదల చేయడంలో ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒక నేతను మంచిగా చూపించటానికి ప్రయత్నిస్తే ఫర్వాలేదుగానీ… అందుకోసం కుట్రతో ఇంకొకర్ని విలన్ గా చూపించటం సరికాదన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు గతంలోనే రెండు మూడు తేదీలు ప్రకటించారని అన్నారు దేవీబాబు చౌదరి. కానీ, ఎన్నికలకు ముందు విడుదల తేదీని నిర్ణయించారని ఆరోపించారాయన. ఎన్నికల ముందు ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఉండటంతో పోలింగ్ లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను నిలపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నేత అని గుర్తు చేశారు. అయితే..దేవీబాబు ఫిర్యాదు అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం..విషయాన్ని రాష్ట్ర సీఈవోను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలోని 175 నియోజకవర్గాల్లో విడుదల కాకుండా చట్టబద్ధంగా అడ్డుకుంటామని అన్నారు దేవీబాబు చౌదరి. పోలింగ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేసినా..యూ ట్యూబ్ లో రిలీజ్ చేసినా తమకు ఏమి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు దేవీబాబు. బుధవారం ఏపీ సీఈవోతో ఫిలిం ఛాంబర్ లో పిర్యాదు చేస్తానని అంటున్నారు. టీడీపీ ఫిర్యాదుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రబాబు

Recommended For You