తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్యను గొడ్డలితో..

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్య రెండు కాళ్లను నరికాడు తాగుబోతు భర్త. ఈ ఘటన నందిగామలో చోటుచేసుకుంది.

లింగాలపాడుకు చెందిన పిచ్చయ్య తాగుడుకు బానిసయ్యాడు. పీకల దాకా తాగి వచ్చి రోజూ భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాగటానికి తనకు డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో అతడికి కోపం కట్టలు తెచ్చుకుంది. ఆగ్రహంతో గొడ్డలి తీసుకుని ఆమె రెండు కాళ్లను నరికాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని కొందరు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read : డీప్‌ స్లీప్‌లో బామ్మ.. పక్కనే పైథాన్.. వీడియో వైరల్