ఆ టిక్కెట్టు కోసం కన్నా కుమారుడితో పోటీ పడ్డ టాలీవుడ్ హీరోయిన్!

బీజేపీ నాయకురాలు, సినీనటి మాధవీలత గుంటూరు వెస్ట్ అసెంబ్లీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు నాగరాజు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఇక్కడినుంచి లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చారు.. అయితే వైసీపీ ఈసారి కన్నా లక్ష్మీనారాయణ కోసం అక్కడ బలమైన అభ్యర్థి అప్పిరెడ్డిని కాకుండా చంద్రగిరి ఏసురత్నంను బరిలోకి దింపుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో అప్రమత్తమైన బీజేపీ.. కన్నాను నరసారావుపేట పార్లమెంటు నుంచి పోటీ చెయ్యాలని సూచించింది.

మరోవైపు ఈ సీటును వదులుకోవడం ఇష్టం లేని కన్నా.. తన కుమారుడు నాగరాజుకు లైన్ క్లియర్ చేస్తున్నారు.. కొంతకాలంగా ఈ టిక్కెట్ కోసం సిన్సియర్ గా ప్రయత్నిస్తున్న మాధవీలతను కాదని నాగరాజుకు ఇవ్వడంపై వైసీపీ, బీజేపీ ల మధ్య బంధం మరోసారి రుజువైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.