టీఆర్ఎస్ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

congress mla kandala upenderreddy will join in trs

తెలంగాణలో టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా… తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. త్వరలోనే కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.