జయరాం హత్య కేసు.. సినీ నటుడుతో పాటు మరో ఇద్దరు అరెస్ట్..

chigurupati jayaram murder case updates

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు . సినీ సహాయ నటుడు సూర్య , కిశోర్‌తో పాటు స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శిఖా చౌదరికి ఈహత్య కేసుతో సంబంధం లేదని తెలిపారు డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈకేసు దర్యాప్తు 90శాతం పూర్తయిందని వెల్లడించారు.

జయరాంను బెదిరించి డబ్బు వసూలు చేయాలని రాకేశ్‌ రెడ్డి కుట్ర పన్నాడని తెలిపారు డీసీపీ శ్రీనివాస్‌. నటుడు సూర్య , కిశోర్‌ జయరాంను రాకేశ్‌ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, హత్య అనంతరం అంజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి రాకేశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు డీసీపీ వివరించారు. రాకేశ్‌ రెడ్డి హత్య చేసిన విషయం తెలిసినా అంజిరెడ్డి చెప్పలేదన్నారు. జయరాంను బెదిరించి రాయించుకున్న పత్రాలు అంజిరెడ్డి వద్ద రాకేష్ రెడ్డి దాచాడని తెలిపారు డీసీపీ..

ఈ హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని ఆయన స్పష్టంచేశారు. రాకేశ్‌ రెడ్డి ప్రగతి రిసార్ట్స్‌ యజమానులను బెదిరించాడని తెలిపారు. రాకేశ్‌ రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని.. ఈ హత్య కేసులో నేతల ప్రమేయం ఉన్నట్టు ఆధారాల్లేవని చెప్పారు. పోలీసుల ప్రమేయంపైనా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు డీసీపీ.

Also Read : విషాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.. 30 మంది..

Recommended For You