అభినందన్ వాళ్లక్కూడా నచ్చాడు.. ఓ చాయ్‌వాలా ఏకంగా..

భారత్‌లోనే కాదు.. శత్రు దేశమైన పాక్‌లో కూడా ఎయిర్ కమాండర్ అభినందన్ హీరోనే. ఆ దేశంలో కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న నానుడిని నిజం చేస్తూ శత్రు దేశం వారి హృదయాలను కూడా దోచుకున్న అభినందన్‌ ఫోటోని కరాచీకి చెందిన చాయ్‌వాలా తన బడ్డీలో పెట్టుకున్నాడు.

అభినందన్ చాయ్ తాగుతున్న ఫోటోతో బ్యానర్ తయారు చేసి పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. అంతే కాదు ఫోటోతో పాటు ఓ క్యాప్షన్ కూడా కింద రాయించాడు. ” అయిసీ చాయ్ కీ దుష్మన్ కోభి దోస్త్ బనాయే” ( ఈ చాయ్ శత్రువుని కూడా మిత్రుడిగా మార్చేస్తుంది) అని ఉర్దూలో రాసి ఉంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాయ్ వాలా తెలివి తేటలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Recommended For You