పోకిరీల చేతిలో చిక్కుకున్న యువతిని రైల్వే మంత్రి..

మంత్రులందరూ తమ డ్యూటీని తాము ఇలా సమర్ధవంతంగా చేస్తుంటే ఎంత బావుంటుంది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారతావనికి పరిష్కారం లభిస్తుంది. మంత్రుల పర్యవేక్షణలో ఉన్న అధికారులు స్పందించినా సగం సమస్యలు తీరిపోతాయి. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆకతాయిల ఆగడాలనుంచి ఓ అమ్మాయిని రక్షించి ప్రశంసలందుకున్నారు. ఇలాంటి సమయంలో ఉపయోగపడుతున్న టెక్నాలజీకి జోహార్లు. ఇంతకీ విషయం ఏంటంటే విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళుతున్న 22415 నెంబర్ ట్రైన్‌లో ఓ యువతి ప్రయాణిస్తోంది. ఆమె భోపాల్ నుంచి న్యూ ఢిల్లీ వెళుతోంది. తానున్న కోచ్‌లోకి కొందరు యువకులు వచ్చి ఆమెతో వాళ్లు అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా తన సోదరుడికి తెలియజేసింది. అయితే రాంచీలో ఉన్న అన్నకు ఏం చేయాలో ఓ క్షణం పాలు పోలేదు. వెంటనే ఆలోచన చేసి ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకు వెళ్లారు. తన సోదరిని ఆకతాయిల బారి నుంచి కాపాడమంటూ మంత్రికి ట్వీట్ చేశాడు.
ట్విట్టర్‌లో పోస్ట్ చూసిన మంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారు. జీఆర్‌పీ పోలీసులను ఆమె ప్రయాణిస్తున్న రైల్లోకి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పోకిరీలను అరెస్ట్ చేశారు. నిమిషాల్లో జరిగిపోయిన ఈ విషయాన్ని యువతి క్షేమ సమాచారాన్ని ఆమె సోదరుడికి రీ ట్వీట్ చేశారు. ” మీకె చేసిన సూచనకు, ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు,. నిశ్చింతంగా ఉండండి. మీ సోదరిని రక్షించేందుకు ఇప్పటికే జీఆర్‌పీ పోలీసులను రంగంలోకి దింపాము అని రిప్లై ఇచ్చారు. మంత్రి స్పందించిన తీరుకు యువతి సోదరుడు ధన్యావాదాలు తెలియజేసాడు.

Recommended For You